- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలోని అల్లూరి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పల్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా.. మృతుల్లో మోస్ట్ వాంటెడ్, మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా ఉన్నారు. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా అలియాస్ సంతోష్‌పై రూ.6 కోట్ల వరకు పలు రాష్ట్రాలు రివార్డు ప్రకటించాయి. దశాబ్దకాలంగా జరిగిన మావోయిస్టు కీలక దాడులకు సూత్రధారిగా హిడ్మా ఉన్నాడు. దంతేవాడ, సుక్మా పరిధిలో 30కి పైగా భారీ దాడులకు నేతృత్వం వహించాడు.
- Advertisement -



