Tuesday, November 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఢిల్లీలో కలకలం.. కోర్టులు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో కలకలం.. కోర్టులు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. రాజధానిలోని పలు కోర్టులు, పాఠశాలలే లక్ష్యంగా బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. సాకేత్‌ కోర్టు, పాటియాలా హౌస్‌ కోర్టు, తీస్‌ హజారీ కోర్టు సహా ఇతర జిల్లా కోర్టులకు మంగళవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి.

అంతేకాదు నగరంలోని ద్వారకా, ప్రశాంత్ విహార్ ప్రాంతాల్లోని సీఆర్‌పీఎఫ్‌ పాఠశాలలను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. బృందాలుగా విడిపోయి కోర్టులు, పాఠశాలల ప్రాంగణాలకు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టు ప్రాంగణాలతోపాటూ పాఠశాలలను ఖాళీ చేయించిన అధికారులు బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అంతేకాదు, నగరంలోని అన్ని జిల్లా కోర్టుల్లోని సిబ్బందిని అప్రమత్తం చేసి భద్రతా తనిఖీలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -