నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ కగార్‌తో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో తుపాకుల మోత మోగుతోంది. ఇటీవల మావోయిష్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఎర్రబోర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవి ప్రాంతాల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే వారి మధ్య భీకరంగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఆపరేషన్ కొనసాగుతున్న కారణంగా కాల్పులు జరిగిన ఖచ్చితమైన ప్రదేశం, పాల్గొన్న బలగాల సంఖ్య వంటి కీలక వివరాలను ప్రస్తుతం వెల్లడించలేమని అధికారులు స్పష్టం చేశారు.
సుక్మా జిల్లాలో తుపాకుల మోత
- Advertisement -
- Advertisement -



