నవతెలంగాణ-హైదరాబాద్: బిహార్ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడంతో ఓటమి చవిచూసిన పార్టీలు ఇందుకు కారణాలను విశ్లేషించుకుంటున్నాయి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్ ‘జన్ సురాజ్’ (Jan Suraaj) పార్టీ ఖాతా కూడా తెరవకుండానే ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. దీనిపై తొలిసారిగా మీడియా సమావేశంలో మంగళవారం నాడు ఆయన స్పందించారు. ‘మావైపు నుంచి చాలా పాజిటివ్‌గా పనిచేశాం. కానీ ఎక్కడో పొరపాటు జరిగింది. ప్రభుత్వాన్ని మార్చడంలో విఫలమయ్యాం. ప్రజలను అర్ధం చేసుకోవడంలో విఫలమైనందుకు నేనే బాధ్యత తీసుకుంటున్నాను. ఆత్మపరిశీలన చేసుకుంటాం. ఒకరోజు మౌనవ్రతం పాటిస్తున్నాను’ అని అన్నారు.
ఇటీవల ఎన్నికల వైఫల్యం అనంతరం ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ఒక ప్రభుత్వం ప్రజల కోసం రూ.40,000 కోట్లు ఖర్చుచేస్తామని ప్రకటించడం ఇదే మొదటిసారని, ఆ కారణంగానే ఎన్డీయే ఘనవిజయం సాధించిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కాగా ఇటీవల 243 బీహార్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఏన్డేయే కూటమి 202 సీట్లను కైవసం చేసుకుంది. మహాగఠ్‌బంధన్ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. అదేవిధంగా ఎన్నికల వ్యూహకర్తగా పేరుగావించిన ప్రశాంత్ కిశోర్..బీహార్‌లో తన వ్యూహ్యాం బెడిసికొట్టింది. 238 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినా ఆ పార్టీ అభ్యర్థులు కనీసం ఒక్క స్థానంలో కూడా విక్టరీ సాధించలేకపోయారు.


