Wednesday, December 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదకద్రవ్యాల నిరోధానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి 

మాదకద్రవ్యాల నిరోధానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి 

- Advertisement -

 – ఎమ్మార్వో ఆంజనేయులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్ 

మాదకద్రవ్యాల నిరోధానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మార్వో ఆంజనేయులు అన్నారు. మంగళవారం మండల రెవెన్యూ  కార్యాలయంలో తాసిల్దార్ తో పాటు అధికారులు సిబ్బంది అందరూ కలసి మాదకద్రవ్యాల నిరోధక సామూహిక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్‌ వంటి మాదక ద్రవ్యాలపై ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వ్యసనంతో జీవితాలు చీకటిలో మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ అలవాటు ఒకసారి పట్టుకుంటే విడిచిపెట్టడం కష్టం అవుతుందని, యువత చదువుఉద్యోగ భవిష్యత్తు అస్తవ్యస్తం అవుతుందని చెప్పారు. స్కూళ్లు,కళాశాలలు,గ్రామస్థాయి సమావేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని ప్రజా ప్రతినిధులు, గురువులు, తల్లిదండ్రులను కోరారు. డ్రగ్స్ రవాణా, విక్రయం, వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.డ్రగ్‌ల రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -