Wednesday, December 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనగోలు కేంద్రాలకు స్థలాలు కరువు 

కొనగోలు కేంద్రాలకు స్థలాలు కరువు 

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
కాటారం మండలంలోని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు స్థలాల కొరత సమస్య నెలకొంది. ప్రభుత్వ స్థలాలు లభ్యత లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానకాలం సీజన్లో రైతులు పండించిన దాన్యం చేతికొచ్చింది. ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి ఏ గ్రేడ్ కు క్వింటాల్కు రూ. 2389 సాధారణ రకానికి రూ. 2369  చొప్పున కనీస మద్దతు ధర కల్పించింది. దీనికి తోడు సన్నాలకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్తో కలిపి ఇస్తుండడంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల బాట పడుతున్నారు.
స్థానికంగా ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో రైతులు వ్యవసాయ భూములు ,ఇళ్ల మధ్యన, రహదారుల పక్కన, ఆలయాల ఆవరణలో, పాట్లు వేసిన ఇళ్ల స్థలాలలో వంటి ప్రదేశాల్లో ధాన్యం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వ భూమిని గుర్తించి శ్వశితంగా ఉండాలని స్థలాలను కేటాయించాలని ప్రభుత్వ భూములను గుర్తించి శ్వశితంగా  ఉండేలా స్థలాలను కేటాయించి, మౌలిక వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు.

కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి: బిఆర్ఎస్ యూత్ నాయకులు గాజుల కుమార్ 
వానకాలం సీజన్లో వరి కోతలు మొదలుపెట్టి 15 రోజులు అవుతున్న సెంటర్ల నిర్వాకులు, ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు గాజుల కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం పోయడానికి స్తలాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి ప్రభుత్వ స్తలలను గుర్తించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -