నవతెలంగాణ – గండీడ్
మండలంలోని లింగాయపల్లి గ్రామంలో మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ గిరమోనిలక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో నిర్ణయించిన మద్దతు ధరకే తమ ధాన్యాన్ని అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని,దళారుల నమ్మి రైతులు మోసపోవద్దని,సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు సత్యనారాయణ రెడ్డి,బాలస్వామి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,సీఈవో ఆశన్న,ఖాజా పాషా,సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.
వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


