Tuesday, December 9, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం79మంది బంగ్లాదేశ్‌ మత్స్యకారుల అరెస్ట్‌

79మంది బంగ్లాదేశ్‌ మత్స్యకారుల అరెస్ట్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భారత తీర రక్షక దళం (ఐసిజి) మంగళవారం 79 మంది సిబ్బంది సహా మూడు బంగ్లాదేశ్‌ ఫిషింగ్‌ బోట్లను స్వాధీనం చేసుకుంది. ఉత్తర బంగాళాఖాతంలో భారత దేశ ఎక్సిక్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఇఇజెడ్‌)లోపల అక్రమంగా చేపలు పడుతున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్‌ 15,16 తేదీల మధ్య అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (ఐఎంబిఎల్‌) వెంబడి నిఘా నిర్వహిస్తుండగా వారు పట్టుబడ్డారు.

ఐసిజి అందించిన వివరాల ప్రకారం.. గస్తీ బృందాలు భారత జలాల్లో బోట్లను గుర్తించాయని, ఇవి భారతదేశ సముద్ర మండలాలు (విదేశీ నౌకల ద్వారా చేపలు పట్టడం నియంత్రణ) చట్టం,1981ని ఉల్లంఘించాయి. బోట్లను అడ్డగించి తనిఖీ చేయగా, సిబ్బంది చెల్లుబాటు అయ్యే పత్రాలు చూపలేకపోయారు. మూడు బోట్లను, సిబ్బందిని ఫ్రేజర్‌ గంజ్‌కు తరలించి, తదుపరి చర్యల కోసం మెరైన్‌ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -