Tuesday, December 9, 2025
E-PAPER
Homeజాతీయంబ‌ల‌వంతంగా ముద్దు..నాలుక‌ను కొరికిన మాజీ ప్రియురాలు

బ‌ల‌వంతంగా ముద్దు..నాలుక‌ను కొరికిన మాజీ ప్రియురాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పెళ్లయిన వ్యక్తికి ఓ మాజీ ప్రియురాలు త‌గిన బుద్ధి చెప్పింది. బ‌ల‌వంతంగా ముద్దు పెట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నించింనందుకు అత‌ని నాలుక‌ను కోరికింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.

కాన్పూర్‌లోని దరియాపూర్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి చంపి..స‌దురు మహిళ గ‌తంలో ప్రేమించుకున్నారు. అయితే ఆ విష‌యం తెలిసి అతడి తల్లిదండ్రులు వేరే అమ్మాయితో వివాహం జరిపించారు. దీంతో చంపికి ఆ మహిళ దూరంగా ఉంటోంది. అయితే సోమవారం మధ్యాహ్నం, ఆ మహిళ పొయ్యి కోసం మట్టిని సేకరించడానికి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లింది. ఒంటరిగా వెళ్లి మహిళను లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె తనను తాను రక్షించుకునేందుకు చంపి నాలుకను గట్టిగా కొరికి, కొంత భాగాన్ని కట్ చేసింది.

తీవ్ర రక్తస్రావం, నొప్పితో విలవిలాడిన చంపి గట్టిగా కేకలు వేయడంతో, స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో కాన్పూర్‌లోని హాలెట్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -