- Advertisement -
గంటకుపైగా మహిళల ఎదురుచూపు
ఆలస్యంగా హాజరైన ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ – జగిత్యాల టౌన్
జగిత్యాల కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన మెగా రుణ మేళా కార్యక్రమం తీవ్ర అవ్యవస్థలతో ప్రారంభమైంది. నిర్ణిత సమయానికి భారీగా హాజరైన మహిళలు గంటకు పైగా వేచి చూడాల్సిరావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు సమయానికి హాజరుకాకపోవడంతో కార్యక్రమం ఆలస్యమైంది. రుణమేళా కోసం దూర ప్రాంతం నుంచి వచ్చిన మహిళలు “సమయం నిర్ధారిస్తే కనీసం కార్యక్రమం కూడా సమయానికే ప్రారంభించాలి”అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ సాయంత్రం 5.30 కు కలెక్టరేట్ కు వచ్చారు.

- Advertisement -



