Wednesday, November 19, 2025
E-PAPER
Homeసినిమాఅత్యధిక థియేటర్లలో రిలీజ్‌

అత్యధిక థియేటర్లలో రిలీజ్‌

- Advertisement -

అర్జున్‌ సర్జ, ఐశ్వర్య రాజేష్‌ కాంబోలో తమిళంలో రూపొందిన ‘తీయవర్‌ కులై నడుంగ’ చిత్రం తెలుగులో ‘మఫ్టీ పోలీస్‌’గా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్‌ లక్ష్మణన్‌ దర్శకత్వంలో జియస్సార్‌ అర్ట్స్‌ బ్యానర్‌ పై జి.అరుల్‌ కుమార్‌ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్‌ ద్వారా నిర్మాత ఎ.ఎన్‌.బాలాజీ విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఎ.ఎన్‌.బాలాజీ మాట్లాడుతూ, ‘యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ – ఐశ్వర్య రాజేష్‌కి తెలుగునాట ఉన్న క్రేజ్‌ని దష్టిలో పెట్టుకుని అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు పర్సనల్‌ డ్రామా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు లోనూ అసాధారణ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అద్భుత అవకాశాన్ని నాకు అందించిన జి.అరుల్‌ కుమార్‌కి, ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు దినేష్‌ లక్ష్మణన్‌కు నా హదయపూర్వక కతజ్ఞతలు’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -