Wednesday, November 19, 2025
E-PAPER
Homeసినిమాఆద్యంతం నవ్వించే సినిమా

ఆద్యంతం నవ్వించే సినిమా

- Advertisement -

రాజ్‌ తరుణ్‌ హీరోగా, రామ్‌ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘పాంచ్‌ మినార్‌’. రాశి సింగ్‌ హీరోయిన్‌. గోవింద రాజు ప్రజెంట్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్‌ మూవీస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌ పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మించారు. ఈనెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రాజ్‌ తరుణ్‌ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఇది ప్రాపర్‌ క్రైమ్‌ కామెడీ. స్క్రీన్‌ప్లే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నిర్మాతలు సినిమాకి కావలసిన ప్రతిదీ ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సమకూర్చారు. దర్శకుడు రామ్‌ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా మేం అనుకున్న దాని కంటే చాలా బెటర్‌గా వచ్చింది.
ఈ సినిమాలో ఒక కీలక మలుపులో వినిపించే పదం ‘పాంచ్‌ మినార్‌’. దాంతో కథ ఇంకో మలుపు తిరుగుతుంది. ఉద్యోగం సంపాదించే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకునే ఓ కుర్రాడు ఎలాంటి పరిస్థితిలో ఇరుక్కున్నాడు అనేది కథ. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ ఎంత నలిగిపోతుంటే, చూసే వాళ్ళకి అంత నవ్వొస్తుంది.
జోనర్‌ క్రైమ్‌ కామెడీనే కానీ ఇది వైలెంట్‌ ఫిలిం కాదు. ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజారు చేసే సినిమాలా ఉంటుంది. ఇందులో మర్డర్‌ లాంటివి ఉండవు. మోసం చేయడం కూడా క్రైమ్‌ కిందకి వస్తుంది. అలాంటి ఒక క్రైమ్‌ చుట్టూ తిరిగే సినిమా ఇది. ఫ్యామిలీ అందరూ కూర్చుని హాయిగా నవ్వుకుంటూ చూడొచ్చు. సినిమా అంతా చాలా మంచి ఫన్‌ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందా అనే ఎగ్జైట్‌మెంట్‌తో చూస్తారు. రాశి సింగ్‌ అద్భుతంగా పెర్ఫామ్‌ చేసింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ చంద్ర బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -