Wednesday, November 19, 2025
E-PAPER
Homeసినిమాకల్ట్‌ మూవీ అని ప్రశంసిస్తారు

కల్ట్‌ మూవీ అని ప్రశంసిస్తారు

- Advertisement -

అఖిల్‌ రాజ్‌, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్‌ రాంబాయి’. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్‌ ఒరిజినల్స్‌ ప్రొడక్షన్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్‌ ఫిలింస్‌, మాన్‌ సూన్స్‌ టేల్స్‌ బ్యానర్స్‌ పై వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకుడు.
ఈనెల 21న ఈ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీవాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో హీరో అఖిల్‌ రాజ్‌ మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో నేను చేసిన రాజు పాత్ర ప్రతి అబ్బాయికి కనెక్ట్‌ అవుతుంది. ప్రతి ప్రేమలో బాధ, కోపం, సంతోషం ఉంటాయి. ప్రేమకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో ధైర్యంగా నిలబడతాడు రాజు. నిజమైన ప్రేమలో ఉన్న ప్రేమికులు ఒకరి కోసం మరొకరు ఎంత బలంగా నిలబడతారు అనేది ఈ మూవీ కథ. చాలా ఇంటెన్స్‌ స్టోరీ ఇది. ఈ స్క్రిప్ట్‌ చదివేప్పుడు క్లైమాక్స్‌లో ఊపిరి ఆడనట్లు అనిపించింది. క్లైమాక్స్‌ చదివిన బాధలోనే ఉండి పోయా. నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం విషాదకరం. పదేళ్లుగా ఇండిస్టీలో స్ట్రగుల్‌ అవుతున్నా. ఆ కష్టానికి ఫలితం ఈ సినిమా తీసుకొస్తుందని నమ్ముతున్నా. ఈ సినిమా రిలీజైన రోజు నుంచి నా జీవితం మారిపోతుందని నమ్ముతున్నా’ అని అన్నారు.
‘రాంబాయి పాత్ర ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అని మా డైరెక్టర్‌ అనుకున్నారో, నేను అలా పర్‌ఫార్మ్‌ చేసి ఆయనను మెప్పించాను అంటే ఆ క్యారెక్టర్‌కు నేను జస్టిఫై చేసినట్లే. ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక ప్రతి ఒక్కరూ బాగా చేశాననే అంటున్నారు. రాంబాయిగా నేను ఎలా నటించాను అనేది థియేటర్స్‌లో సినిమా చూసిన ప్రేక్షకులే చెప్పాలి. ఈ పాత్రలో అనేక లేయర్స్‌ ఉన్నాయి. తను ప్రేమికుడు రాజు దగ్గర క్యూట్‌గా హ్యాపీగా ఉంటుంది, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడుతుంది, తన ప్రేమను తండ్రి అంగీకరించాలని తపన పడుతుంది. ఇది కల్ట్‌ మూవీ ప్రేక్షకులు ప్రశంసిస్తారు’ అని హీరోయిన్‌ తేజస్వినీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -