జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘కిల్లర్’. ధ్యానం నాన్న ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులు. పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది.
మంగళవారం ఈ సినిమా నుంచి ‘ఫైర్ అండ్ ఐస్’ సాంగ్‌ను లాంచ్ చేవారు.
ప్రొడ్యూసర్ పద్మనాభరెడ్డి ఎ.మాట్లాడుతూ,’మనం లైఫ్‌లో గర్వపడే సందర్భాలు కొన్ని ఉంటాయి. పూర్వజ్‌ను ఇంట్రడ్యూస్ చేసినందుకు నేను గర్వపడుతున్నా. ఈ సినిమా ప్రారంభించినప్పుడు కూడా ఇంత బాగా అవుట్ పుట్ వస్తుందని అనుకోలేదు. ఈ మూవీలోని విజువల్స్, సాంగ్స్ అవుట్‌ఫుట్ చూసి సర్‌ప్రైజ్ అయ్యాం. ఈ సినిమాలో కిల్లర్ పర్‌ఫార్మెన్స్‌లు చూస్తారు’ అని అన్నారు.
‘యాక్టర్ అయ్యాక మంచి స్టంట్స్‌తో యాక్షన్ మూవీ ఒకటి చేయాలని ఉండేది. ఆ విషయం పూర్వజ్‌కు చెప్పాను. ఒకవైపు ‘మాస్టర్ పీస్’ సినిమా జరుగుతుండగానే ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఈ మూవీలో బాగా పర్‌ఫార్మ్ చేశానని మా యూనిట్ వాళ్లు చెబుతున్నారు. ఒక కొత్త తరహా కంటెంట్‌తో మీ ముందుకు వస్తున్నాం’ అని హీరోయిన్ జ్యోతి పూర్వజ్ చెప్పారు. డైరెక్టర్ పూర్వజ్ మాట్లాడుతూ, ‘తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. ఇలాంటి టైమ్‌లో మేము చేసిన ఈ సినిమా మరో సరికొత్త ప్రయత్నంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అది ఇండిస్టీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది. జ్యోతి పూర్వజ్ ఐదు డిఫరెంట్ రోల్స్‌లో నటించింది. స్పై, వాంపైర్, సూపర్ షీ, టెర్రరిస్ట్, రక్షా రై ఇలా ఐదు భిన్నమైన పాత్రల్లో ఆమె అద్భుతంగా నటించింది. సరికొత్త సైన్స్ ఫిక్షన్‌గా ఈసినిమా అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.
సరికొత్త సైన్స్ ఫిక్షన్‌గా సర్‌ప్రైజ్ చేస్తుంది
- Advertisement -
- Advertisement -



