‘వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో మరో సినిమా రూపొందుతోంది.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ సినిమా చేస్తున్న నిర్మాత వెంకట సతీష్ కిలారు దీన్ని నిర్మిస్తున్నారు.
మెజెస్టిక్ అండ్ మైౖటీ క్వీన్స్ చాప్టర్ ప్రారంభమైంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నయనతార ఈ ప్రాజెక్ట్‌లో చేరారు. ఆమె పాత్ర కథనానికి కీలకం కానుంది. ‘సింహ, జై సింహా, శ్రీ రామ రాజ్యం’ తర్వాత బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న 4వ చిత్రం ఇది. నయనతార పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ ఎనౌన్స్ మెంట్ చేశారు. ‘సముద్రమంత ప్రశాంతతను, తుపాను అంత బీభత్సాన్ని తనలో మోసే రాణి మా సామ్రాజ్యంలోకి అడుగు పెట్టనుంది’ అంటూ అనౌన్స్‌మెంట్ వీడియాతో నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది టీమ్. గోపిచంద్ మలినేని తొలిసారిగా హిస్టారికల్ డ్రామాలోకి అడుగు పెడుతున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది.
మహారాణిగా నయనతార..
- Advertisement -
- Advertisement -



