Wednesday, November 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రజా ఉద్యమాలకు తీరని నష్టం

ప్రజా ఉద్యమాలకు తీరని నష్టం

- Advertisement -

భూపాల్‌రెడ్డి మృతికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నివాళి
పార్టీ కోసం నిరంతరం పోరాడారు : కేంద్ర కమిటీ సభ్యలు ఎస్‌.వీరయ్య
నేడు అంత్యక్రియలు
నవతెలంగాణ-చౌటుప్పల్‌

సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ కార్యదర్శివర్గ సభ్యులు చింతల భూపాల్‌రెడ్డి అకాల మృతి పార్టీకి, ప్రజా ఉద్యమానికి తీరని నష్టమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల కేంద్రంలో అనారోగ్యంతో మృతిచెందిన భూపాల్‌రెడ్డి మృతదేహాన్ని మంగళవారం జాన్‌వెస్లీ సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబానికి సానుభూతిని తెలిపారు. అనంతరం సంతాప సభలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. మానవ జీవితంలో పుట్టుక, చావు సహజమే అయినప్పటికీ ఉద్యమ నాయకులు చనిపోవడం ప్రజాఉద్యమాలకు, వర్గ పోరాటాలకు నష్టదాయకమన్నారు. చింతల భూపాల్‌రెడ్డి పార్టీ, యువకుల పట్ల ఎనలేని పట్టుదలతో పనిచేశారన్నారు. ప్రజానాయకునిగా, ప్రజా ప్రతినిధిగా, రైతు నాయకునిగా చౌటుప్పల్‌ ప్రాంత ప్రజలకు సేవలు అందించినట్టు గుర్తుచేశారు. కందాల రంగారెడ్డి మృతి తర్వాత పార్టీని నిలబెట్టిన ముఖ్య నాయకుల్లో భూపాల్‌రెడ్డి ప్రముఖుడన్నారు. సమాజంలో కొనసాగుతున్న దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా.. సమాజ నిర్మాణం కోసం మార్క్సిస్టు పార్టీ చేపడుతున్న మహత్తర పోరాటంలో భూపాల్‌రెడ్డి పాత్ర గొప్పదన్నారు. సీపీఐ(ఎం) నిర్వహించే ప్రజా పోరాటాల్లో పాల్గొని ఆయన ఆశయాలు సాధించాలని పిలుపునిచ్చారు. చింతల భూపాల్‌రెడ్డి అంత్యక్రియలను నేడు(బుధవారం) నిర్వహించనున్నట్టు తెలిపారు.

చౌటుప్పల్‌ మాజీ సర్పంచ్‌ చింతల భూపాల్‌ రెడ్డి మరణం పార్టీకి, చౌటుప్పల్‌ ప్రాంత ప్రజలకు తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. భూపాల్‌రెడ్డి ఈ ప్రాంత ప్రజల కోసం పార్టీ కోసం నిరంతరం పని చేశారని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌డి.జహంగీర్‌, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి, మాటూరి బాలరాజు, సింగిల్‌విండో చైర్మెన్‌ చింతల దామోదర్‌రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, గోశిక కరుణాకర్‌, గంగదేవి సైదులు, సీఐటీయు జిల్లా కోశాధికారి దోనూరి నర్సిరెడ్డి, వలిగొండ మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, నాయకులు బండారు నర్సింహా, బత్తుల శ్రీశైలం, ఉష్కాగుల శ్రీనివాస్‌, బత్తుల విప్లవ్‌కుమార్‌ తదితరులు నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -