Wednesday, November 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకేంద్రం సహకరించాలి

కేంద్రం సహకరించాలి

- Advertisement -

పట్టణాభివృద్ధి, ఫ్యూచర్‌ సిటీకి మద్దతు ఇవ్వాలి
గుజరాత్‌ తరహాలోనే తెలంగాణకు నిధులివ్వండి
మూసీ పునరుజ్జీవం, మెట్రో రైల్‌ విస్తరణకు అనుమతులివ్వండి
డిసెంబర్‌ 9న ‘రైజింగ్‌ తెలంగాణ విజన్‌ 2047 డాక్యుమెంట్‌’ ఆవిష్కరణ : ప్రాంతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

పట్టణాభివృద్ధికి కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కోరారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి మద్దతునివ్వాలన్నారు. గుజరాత్‌కు సహకరించినట్టుగానే తెలంగాణ రాష్ట్రానికి నిధులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకమైన భారత్‌ ప్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవం, మెట్రో రైల్‌ విస్తరణకు వెంటనే అనుమ తులివ్వాలని కేంద్రాన్ని కోరారు. మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ దిశగా రాష్ట్రం ముందుకు సాగుతున్నదనీ, అందులో భాగంగా డిసెంబర్‌ 9న రైజింగ్‌ తెలంగాణ విజన్‌ -2047 డాక్యు మెంట్‌’ ఆవిష్కరించనున్నట్టు సీఎం తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రాంతీయ అర్భన్‌ డెవలప్‌మెంట్‌ సమావేశంలో సీఎం మాట్లా డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు లభిస్తేనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 30 వేల ఎకరాలతో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నట్టు ఈ సందర్భంగా సీఎం వివరించారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. 2047 వరకు మూడు ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యంగా పని చేస్తున్నట్టు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో 10వ శాతం తెలంగాణ వాటా ఉండా లని చూస్తున్నట్టు తెలిపారు. మూడేండ్లలో ఎలక్ట్రిక్‌ బస్సులనే నడుపుతామన్నారు. అన్ని రాష్ట్రాలకు తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దు తామని చెప్పారు. అందుకు కేంద్ర సహకారం ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ కూడా భాగమవుతుందని తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తే దేశాభివృద్ధి మరింత వేగవం తమవుతుందని చెప్పారు. కేంద్రం నిర్దేశించుకున్న 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర వాటా 10 శాతం ఉండాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. జీడీపీలో ప్రధానంగా ఐదు మెట్రో పాలిటన్‌ నగరాలైన ఢిల్లీ, ముంబయి, బెంగ ళూరు, చెన్నై, హైదరాబాద్‌ దేశానికి ఎంతో కీలకం గా ఉన్నాయనీ, కేంద్రం సహకరించకుంటే రాష్ట్రా లాభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ గుజరాత్‌ మోడల్‌ రూపొందిం చుకున్నట్టే తాము తెలంగాణ మోడల్‌ తీసుకొచ్చా మని వివరించారు. ఆయన సబర్మతి నది ప్రక్షాళన చేపట్టినట్టే తాము మూసీ పునరుజ్జీవం చేయబోతున్నట్టు చెప్పారు. అభివృద్ధి కోసం కేంద్రాన్ని కోరుతామనీ, ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, గుజరాత్‌ మంత్రి కనుభారు మోహన్‌లాల్‌ దేశారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -