Wednesday, November 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు పుట్టపర్తికి ప్రధాని మోడీ..

నేడు పుట్టపర్తికి ప్రధాని మోడీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నేడు పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల కోసం నిర్వాహకులు అంతగరంగవైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మెడీ సైతం పాల్గొననున్నారు. ఉదయం. 9.30 గంటలకు ప్రధాని పుట్టపర్తికి చేరుకుంటారు. ఉదయం.9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు పుట్టపర్తిలో సత్యసాయి సమాధిని దర్శించుకుంటారు. హిల్ వ్యూ స్టేడియంలో వేడుకలు జరగనుండగా సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మంత్రి లోకేష్ ఇతర రాజకీయప్రముఖులు వేడులకల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మోడీ సత్యసాయి రూ.100 నాణెంతో పాటు పోస్టల్ స్టాంప్ ఆవిష్కరిస్తారు. నాణెెంలో ఒకవైపు సత్యసాయిబాబా చిత్రం మరోవైపు అశోక స్తంభం ఉంటాయి. ఈ నాణేలను త్వరలోనే ఆన్ లైన్ ద్వారా విక్రయించనున్నారు. ఇక ఈ వేడుకలకు స్థానికులతో పాటు విదేశాల నుండి సైతం భక్తులు హాజరవుతున్నారు. అంతే కాకుండా సచిన్, ఐశ్వర్యారాయ్ లాంటి సెలబ్రెటీలు సైతం పుట్టపర్తికి చేరుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -