Wednesday, November 19, 2025
E-PAPER
Homeకరీంనగర్మొక్కుబడిగా వెబ్సైట్ ఆధునీకరణ 

మొక్కుబడిగా వెబ్సైట్ ఆధునీకరణ 

- Advertisement -

– అధికారులు మారిన సమాచారం మార్చారా 
నవతెలంగాణ-జగిత్యాల టౌన్ : జిల్లాలోని వివిధ శాఖల అధికారులకు తరచూ బదిలీలు జరుగుతుంటాయి. బదిలీలు జరిగిన తక్షణమే జిల్లా అధికారులు అట్టి వివరాలను ఆ జిల్లా వెబ్సైట్లో ఆధునికరించాల్సి ఉంటుంది. కానీ జగిత్యాల జిల్లాలో ఇప్పటికే పలుమార్లు వెబ్సైట్ ను ఆధునికరించిన అధికారులు అందులో అధికారుల సమాచారాన్ని ఆధునికరించడంలో విఫలమవుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా వెబ్సైట్ ను పరిశీలించగా అక్టోబర్ లో 18 న, 29 న, నవంబర్ లో 18 తో పాటు పలుమార్లు ఆధునీకరించినట్లు వెబ్సైట్ సమాచారం ద్వారా స్పష్టం అవుతుంది. ఇన్నిసార్లు ఆధునికరించిన అధికారులు జిల్లాలోని బదిలీపై వచ్చిన అధికారుల వివరాలను అందులో ఆధునికరించడంలో విఫలమవుతున్నారననే దానికి నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లా పంచాయతీ అధికారిగా మదన్మోహన్ బదిలీ అయి రేవంత్ నూతనంగా బాధ్యతలు స్వీకరించి కొన్ని రోజులు గడిచిన సమాచారం ఆధునికరించలేకపోయారు. 

జిల్లా ప్రజా సంబంధాల అధికారి గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన లక్ష్మణ్ కుమార్ బదిలీ అయి పి నరేష్ నూతన బాధ్యతలు స్వీకరించినారు. అయినా వెబ్సైట్లో మార్పు జరగలేదు. 
జిల్లా ఫైర్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వై. సైదులు జిల్లాలో బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల తర్వాత నుండి హైదరాబాదులో అదే శాఖలో ట్రైనింగ్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్నారు. కానీ జిల్లా వెబ్సైట్ లో మాత్రం ఆ వివరాలు నమోదు చేయలేకపోయారు. చీఫ్ ప్లానింగ్ అధికారి పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించిన ఆర్. రాజారామ్ గత నెలలోనే పదవి విరమణ చెందగా అతని స్థానంలో సత్యం నూతనంగా సిపిఓగా బాధ్యతలు స్వీకరించారు. కానీ వెబ్సైట్లో అతని పేరు ఆధునికరించలేకపోయారు. ఇలా ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అధికారుల వివరాలు ఆధునికరిస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -