ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
సమాజ అభివృద్ధికి అవసరమైన మానవ సంపదను పెంపొందించడంలో యూనివర్సిటీల పాత్ర ఎనలేనిది కానీ నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో మాత్రం పరిస్థితులు బిన్నంగా ఉన్నాయని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అన్నారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ గత అక్టోబర్ నెల 31వ తేదీన రాష్ట్ర హైకోర్టు వర్సిటీలో 2012 నోటిఫికేషన్ పేరిట పెద్ద ఎత్తున అక్రమ నియామకాలు జరిగాయని, ఆ నోటిఫికేషన్ ను రద్దు చేసి అప్పుడు అక్రమంగా నియామకమైన వారందరిని తొలగించాలని హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాత్రం అధికారులు అక్రమార్కులకు అండగా ఉండడం విడ్డూరం. ఇప్పటికైనా తెయు అధికారులు స్పందించి హైకోర్టు తీర్పు అనుసరం అక్రమ నియామకాలు రద్దు చేయాలని లేనియెడల తెలంగాణ విశ్వవిద్యాలయ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు కై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. హైకోర్టు తీర్పు అమలుకై విద్యార్ధి ఉద్యమాలు ఉదృతం చేస్తామని లక్ష్మణ్ అన్నారు.
రాష్ట్ర AISF 4వ మహాసభలు జనవరి 2026 నాటికి వాయిదా..
ఈనెల నవంబర్ తేదీలలో నిజామాబాద్ నగర కేంద్రంలో నిర్వహించవలసిన తెలంగాణ రాష్ట్ర అఖిలభారత విద్యార్థి సమితి (AISF) 4వ మహాసభలను అనివార్య కారణాల రీత్యా వాయిదా వేయడం జరిగింది తిరిగి ఈ మహాసభలను నిజామాబాద్ నగర కేంద్రంలోని రాబోయే జనవరి 28,29,30 – 2026 లో నిర్వహించబోతున్నట్టు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తెలిపారు. మహాసభల మార్పుని రాష్ట్ర విద్యార్థులు,విద్యావేత్తలు, శ్రేయాభిలసులు, అధికారులు, నాయకులు గమనించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు రఘురాం నిజామాబాద్ జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు సుబోద్, నాయకులు ఉపాధ్యక్షుడు కుషాల్,జిల్లా కొ శాధికారి అనుషా,జిల్లా సహాయ కార్యదర్శి కార్తీక్, జిల్లా నాయకులు కిషోర్, దినేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.



