Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పుట్టిన వెంటనే నవజాత శిశు భద్రత పై అవగాహన

పుట్టిన వెంటనే నవజాత శిశు భద్రత పై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
నేషనల్ నియోనేటలిజి ఫోరం తెలంగాణ (NNF–TS), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ (IMA), భారతీయ పిల్లల వైద్యుల సంఘం (IAP) మరియు నిజామాబాద్ Obstetrics & Gynaecology అసోసియేషన్ (NOGA) సంయుక్తంగా వీరి ఆధ్వర్యంలో నిర్వహించిన “ పుట్టిన వెంటనే నవజాత శిశు భద్రత – అవగాహనా సదస్సు కార్యక్రమం” లో ముఖ్య అతిధిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే  ” నవజాత శిశు సంరక్షణ వారోత్సవాల” పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతు IMA నిజామాబాద్, IAP మరియు NNF టీఎస్ సంస్థలు ప్రజారోగ్య రంగంలో చేస్తున్న సేవలు అభినందనీయమైనవి. సమాజంలో శిశు ఆరోగ్యంపై అవగాహన పెంపు ప్రతి కుటుంబాన్ని రక్షించే బాధ్యత” అని పేర్కొన్నారు.కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు శిశుమరణల రేటును తగ్గింస్తున్నాయి అని తెలిపారు. నేషనల్ నియోనేటలిజి ఫోరం తెలంగాణ అధ్యక్షులు డా. కె. శ్రీశైలం  మాట్లాడుతూ: నవజాత శిశు మరణాలను తగ్గించడానికి ప్రసవ సమయం నుండి పాటించాల్సిన ముఖ్యమైన శిశు సంరక్షణ పద్ధతులను వివరించారు. పుట్టిన తొలి గంటలో శిశువుకు అవసరమైన ఆరు కీలక అంశాలు వివరించారు:

1. ప్రసవం తప్పనిసరిగా ఆసుపత్రిలో జరగాలి
2. బొడ్డు తాడు 1–3 నిమిషాల తరువాత మాత్రమే కత్తిరించాలి
3. శిశువును పుట్టిన వెంటనే తల్లి ఛాతీపై ఉంచాలి (Skin-to-Skin Contact)
4. తేనె, ఆవుపాలు, నీరు వంటి పదార్థాలు ఇవ్వకూడదు – తల్లిపాలే మొదటి ఆహారం
5. శిశువును ఎల్లప్పుడూ వెచ్చగా ఉంచాలి; స్నానం ఒక రోజు తరువాత లేదా బొడ్డు ఊడిన తరువాత మాత్రమే చేయాలి
6. కంగారూ మదర్ కేర్ (KMC) – శిశువుకు వెచ్చదనం, తల్లిపాలు, రోగనిరోధక శక్తి పెరగడానికి అత్యంత ముఖ్యమైన పద్ధతి

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మి నారాయణ, మఠం. పవన్, NNF TS అధ్యక్షులు డా. కె. శ్రీశైలం, డా. లింగారెడ్డి (NNF TS EC మెంబర్), IMA అధ్యక్షులు డా. విశాల్ ఆకుల, IMA నేషనల్ యాక్షన్ కమిటీ చైర్మన్ డా. ఈ. రవీంద్ర రెడ్డి, ASI రాష్ట్ర అధ్యక్షులు డా. టీ. జీవన్‌రావు, డా. అరవింద్ రెడ్డి, డా. ఎం.డి. రషీద్ అలీ, డా. నవీన్ మాలు, IAP నిజామాబాద్ అధ్యక్షులు డా. సూర్యారావు, ప్రధాన కార్యదర్శి డా. Ch. శ్రీకాంత్, డా. అజ్జ శ్రీనివాస్, డా. నేతి బాలేశ్, డా. దీపక్ రాథోడ్, డా. పద్మజ, డా. సవిత రాణి, NOGA అధ్యక్షురాలు డా. మల్లేశ్వరి, కార్యదర్శి డా. శైలజ, IMA వైద్యులు: Dr. అరవింద్ రెడ్డి, Dr. వినోద్ కుమార్ గుప్త, Dr. పద్మజా, Dr. వెంకట్, Dr. శ్రీధర్, Dr. అయ్యప్ప చంద్రశేఖర్, Dr. మౌనిక, Dr. హిమజ, Dr. చంద్రశేఖర్, Dr. నవీన్ మల్లు, Dr. సవితా రాణి, Dr. రామ్మోహన్, Dr. అరుణ్ గుప్త, అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల NICU సిబ్బంది, ప్రగతి హాస్పిటల్ మరియు “అలా సరోజినమ్మ కాలేజ్ అఫ్ నర్సింగ్” విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -