Wednesday, November 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గడ్డంగూడ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి..

గడ్డంగూడ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి..

- Advertisement -

తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎస్కే అబ్దుల్లా
నవతెలంగాణ – జన్నారం

మండలంలోని దేవునిగూడెం పంచాయతీ పరిధిలోగల గడ్డం గూడెం కు వెళ్లే రహదారి అధ్వానంగా ఉందని ఆదివాసులు అనారోగ్యానికి గురైనప్పుడు జన్నారం ప్రభుత్వ ఆసుపత్రికి రావడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఆ గ్రామాన్ని బుధవారం  సందర్శించిన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎస్కే అబ్దుల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికరపు అశోక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. గడ్డం గూడెంలో టిఏజిఎస్ గ్రామ శాఖ సమావేశం  ఆరె. ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్కే అబ్దుల్లా  కనికరపు అశోక్.  హాజరైనారు.

ఈ సమావేశంలో గూడెంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పై ఆరా తీశారు. ముఖ్యంగా గూడెంలో 75 నివాసపు ఇండ్లు ఉన్నాయని, వీరికి తాగునీటి సౌకర్యం లేదు. వాగు నీరు తాగాల్సి వస్తుందని, గ్రామానికి వచ్చే రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదని, చిన్నపిల్లలకి స్కూలు వసతి లేదని అట్లనే ఈ ఊరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ అధికారులు పరిశీలించి సమస్యలన్నీ పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ శాఖ సభ్యులు గిరిజనులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -