- Advertisement -
రాష్ట్రస్థాయిలో మూడో స్థానం
నవతెలంగాణ-రామారెడ్డి
నల్గొండ జిల్లాలో ఈనెల 14 నుండి 16 వరకు జరిగిన అండర్ 17 బాల బాలికల రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో రామారెడ్డి విద్యార్థులు సత్తా చాటారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన పదిమంది విద్యార్థులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి పాల్గొని రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచారు. భార్గవ్ రామ్, తేజేశ్వర్, అరుణ్ కుమార్, బాలికల విభాగంలో తేజశ్రీ, వైష్ణవి, లతిక, రుచిక, దీక్ష, సంజన, వైష్ణవి తదితరులను ప్రధానోపాధ్యాయులు వేణుమాధవ్ తో పాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు లింగంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



