- Advertisement -
• బంగారం, వెండి ఆభరణాలు అపహరణ
నవతెలంగాణ-పెద్దవంగర
దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగిన సంఘటన మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఆలయ పూజారి జిన్న సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. గంట్లకుంట గ్రామంలోని దుర్గమ్మ ఆలయంలో తెల్లవారుజామున పూజ కోసం ఆలయానికి వెళ్లగా.. గుడి తాళం పగులగొట్టి, తలుపులు తెరిచి ఉన్నాయని తెలిపారు. ఆలయం లోపలికి వెళ్లి పరిశీలించగా..అమ్మవారి విగ్రహానికి అలంకరించిన బంగారు, వెండి (ముక్కు పుడక, కన్నులు, పట్టీలు) ఆభరణాలు అపహరించారు. వాటితో పాటు ఆలయ హుండీ ఎత్తుకెళ్లి, క్వారీలో పడేశారు. ఇటీవలే పెద్దవంగర దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఆగంతకులు వరుసగా దుర్గమ్మ ఆలయాలను టార్గెట్ చేయడంతో మండల వాసులు ఉలిక్కిపడుతున్నారు.
- Advertisement -



