ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల హవా కొనసాగించింది. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్‌తోపాటు కిదాంబి శ్రీకాంత్, ఆయుష్ శెట్టి, తస్మిన్ మన్నేపల్లి రెండోరౌండ్‌కు చేరగా.. కిరణ్ జార్జి మూడుసెట్ల హోరాహోరీ పోరులో ఓటమిపాలయ్యాడు. లక్ష్యసేన్ 21-17, 21-13తో సూ(చైనీస్ తైపీ), కిదాంబి శ్రీకాంత్ 21-19, 19-21, 21-15తో లీ(చైనీస్ తైపీ)పైనే విజయం సాధించారు. ఇక ఆయుష్ శెట్టి 21-11, 21-15తో యువాన్ సామ్(కెనడా)ను చిత్తుచేయగా.. కిరణ్ జార్జి 21-11, 22-24, 17-21తో జపాన్‌కు చెందిన నిషిమోటో చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. ఇక హెచ్‌ఎస్ ప్రణయ్ 6-21, 21-12, 21-17తో మార్లెల్నో(ఫ్రాన్స్)ను చిత్తుచేసి రెండోరౌండ్‌కు చేరాడు.



