నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్
‘దేశంలో పరిస్థితులు మారాయి. ఆయుధాల ద్వారా ఎదుర్కోవడం కష్టం. జనజీవన స్రవంతిలో కలవండి’ అని అజ్ఞాతంలోని మావోయిస్టులకు లొంగిపోయిన మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. వీడియో ద్వారా ఒక సందేశాన్ని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మాతో పాటు ఆరుగురు సహచరులు చనిపోవడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. తాము నెలన్నర కిందనే ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశామని తెలిపారు.
40 ఏండ్ల అజ్ఞాత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామనీ, ఎంతో మంది సహచరులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు మారాయనీ, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో అడవుల నుంచి ఆయుధాల ద్వారా ఏదీ సాధించలేమని పేర్కొన్నారు. మిగతా వారు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు.
మావోయిస్టుల్లారా జనజీవ స్రవంతిలో కలవండి : మల్లోజుల వేణుగోపాల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



