Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయంమంత్రి అధికారిక నివాసంలో చిరుత క‌లక‌లం

మంత్రి అధికారిక నివాసంలో చిరుత క‌లక‌లం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రాజస్థాన్‌లో చిరుత (Leopard) కలకలం రేపింది. జలవనరుల శాఖ మంత్రి సురేష్‌ సింగ్‌ రావత్‌ (Suresh Singh Rawat) నివాసంలోకి చిరుత చొరబడ్డట్లు అధికారులు గురువారం తెలిపారు. చిరుత ప్రవేశించడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. రెస్క్యూ బృందం వెంటనే సంఘటనాస్థలానికి చేరుకొని చిరుత కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. చిరుత కోసం మంత్రి నివాసంతోపాటూ సమీపంలోని ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.

స‌దురు మంత్రి నివాసం రాజధాని జైపూర్‌ లోని వీవీఐపీ సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉంటుంది. అత్యంత హై సెక్యూరిటీ జోన్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సహా అనేక మంది ప్రముఖులు నివసిస్తుంటారు. బంగ్లా నంబర్‌ 11లో రావత్‌ నివాసం ఉంటున్నారు. ఆ బంగ్లాకు సమీపంలోనే రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాసం, పలువురు మంత్రుల అధికారిక ఇళ్లు ఆ బంగ్లాకు సమీపంలోనే రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాసం, పలువురు మంత్రుల అధికారిక ఇళ్లు ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -