నవతెలంగాణ – హైదరాబాద్: వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుండగా ఒక కలెక్టర్ ఆంగ్లంలో వివరాలు తెలియజేస్తుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగులో మాట్లాడాలని సూచించారు. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆంగ్లంలో వివరాలు వెల్లడించే ప్రయత్నం చేయగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుగజేసుకుని తెలుగులో మాట్లాడాలని అన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా ఉన్నారని, వారందరికీ అర్థమయ్యేలా వీలైనంత వరకు తెలుగులో మాట్లాడాలని ఆయన సూచించారు. దీంతో కలెక్టర్ గరిమ తెలుగులో వివరాలు వెల్లడించారు.
తెలుగులో మాట్లాడండి.. కలెక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



