నవతెలంగాణ – నవాబు పేట
నవాబుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉద్యాన శాఖ,ప్రాథమిక సహకార సంఘం ప్రి యూనిక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో గురువారం ఆయిల్ పామ్ పంటల సాగుపై రైతులకు అవగాహనా సదస్సును మండల వ్యవసాయ అధికారి కృష్ణ కిషోర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉద్యాన శాఖ జిల్లా అధికారి వేణుగోపాల్,జిల్లా కోపరేటివ్ ఆఫీసర్ కృష్ణ,ఉద్యాన అధికారి మహేందర్ హాజరై ఆయిల్ పామ్ తోట రైతులకు ఏవిధంగా ఆర్థిక పరంగా అభివృద్ధికి దోహద పడుతుంది అని వివరించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ జిల్లా అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ.. పంట సాగులో పాటించవలసిన నీటి యాజమాన్యం,ఎరువుల యాజమాన్యం మూడు సంవత్సరాలు దాటినా కాపుకి వదిలిన ఆయిలపామ్ తోటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్రొత్తగా వేయదలచిన రైతులకు ప్రభుత్వం అందించే రాయితీ గురించి వివరించారు.
ఆయిలపామ్ పంటకు ప్రభుత్వం డ్రిప్, మొక్కలకు,నాలుగు సంవత్సరాల వరకు అందిస్తున్న సహకారాన్ని,ఆయిల్ పామ్ వల్ల కలిగే లాభలను దృష్టిలో ఉంచుకొని ఆసక్తి ఉన్న రైతులు ఆయిలపామ్ పంట వేసుకోవాల్సిందిగా సూచించారు.ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మెన్ హర లింగం మాట్లాడుతూ ప్రాథమిక సహకార సంఘం వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఉద్యాన శాఖ పిఎసిఎస్ ఆధ్వర్యంలో మన రైతు వేదికలో ఆయిల్ ఫామ్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి రాయితీలు రైతులు ఉపయోగించుకోవాలని అలాగే సహకార సంఘం నుంచి కూడా లోన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు,జిల్లా కోపరేటివ్ ఆఫీసర్ కృష్ణ మాట్లాడుతూ.. మన దైనందిన జీవితంలో వంట నూనె కు చాలా ప్రాముఖ్యత ఉందని అందులో ఆయిల్ ఫామ్ లేనిది పూట గడవని పరిస్థితి నెలకొందని అందువల్ల దేశంలో నూనె పంటలకు చాలా డిమాండ్ ఉందని తెలిపారు.
ఆయిల్ పామ్ వేయదలుచుకున్న రైతులు ఉద్యాన శాఖను సంప్రదించి తోటలు పెట్టుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అందించే రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించడం జరిగింది.చివరగా ఉద్యాన అధికారి మహేందర్ మాట్లాడుతూ ఉద్యాన శాఖ ద్వారా అందించే రాయితీ వివరాలు తెలపారు.ఇప్పటికే సాగుచేస్తున్న రైతులు రామిరెడ్డి,రాములు ను అడిగి ఆయిల్ పామ్ పంట యొక్క అనుభవాలు రైతులతో పంచుకున్నారు.ఈ యొక్క కార్యక్రమంలో మండల రైతులు పెద్ద మొత్తంలొ పాల్గొన్నారు.కంపెనీ జిల్లా మేనేజర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో ఆయిలపామ్ గెలలు కలెక్షన్ సెంటర్స్ ద్వారా సేకరించి రైతుల ఖాతాలో వారం రోజుల్లో డబ్బు జమచేస్తున్న విధానాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆయిలపామ్ పంట వేసుకున్న రైతులు, ఆయిల్ ఫాం పంట వేసుకోవడానికి ఉత్సహంగా ఉన్న రైతులు,ఉద్యాన శాఖా అధికారి మాట్లాడుతూ ఆయిల్ పామ్ కంపెనీ సిబ్బందిని సంప్రదించి పంట వేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలోవ్యవసాయ అసిస్టెంట్ రిజిస్టర్ లావణ్య, ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏరియా మేనేజర్ బాలరాజు,మండల వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, రైతులు రాంరెడి రెడ్డి, వెంకటయ్య, రాములు, మధుసూదన్ రెడ్డి, నాగరాజు, శివ దర్శన్ తదితరులు పాల్గొన్నారు.



