- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
గాంధీభవన్ లో నిజాంబాద్ పద్మశాలి వసతి గృహ ఎన్నికల విజయతలకు టిపిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అభినందనలను గురువారం తెలియజేశారు. వసతి గృహ ఎన్నికల్లో గెలుపొందిన గికొండ యాదగిరి బృందానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. హాస్టళ్లు అంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గృహాలు అని టీపీసీసీ చీఫ్ అన్నారు. విద్యార్థులకు సేవ చేయాలన్న తపనతో ముందుకు వచ్చిన యాదగిరి బృందాన్ని హృదయపూర్వకంగా ఆయన అభినందించారు. విద్యార్థులకు తగిన వసతులు, సదుపాయాలు కల్పించడంలో విజేత బృందం ముందుండి పనిచేయాలని సూచించారు.
- Advertisement -



