Friday, December 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్‌సంగ్ గురు అవార్డు అందుకున్న నాగరాజు 

అన్‌సంగ్ గురు అవార్డు అందుకున్న నాగరాజు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
అన్‌సంగ్ గురు అవార్డును నాగరాజు అందుకున్నారు.డాక్టర్ కవిత రెడ్డి ఫుట్బాల్ అకాడమీ ఫౌండర్ (డీకే ఆర్ ఎఫ్ ఏ)  డాక్టర్ కవితా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. భారత ఫుట్‌బాల్‌లో గ్రాస్‌రూట్ స్థాయిలో యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో చూపిన విశేష సేవలకు గుర్తింపుగా, ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ కోచెస్ ఇన్ ఇండియా (ఎఫ్ ఎఫ్ సి ఐ) నుండి అన్‌సంగ్ గురు అవార్డు అందుకున్న కోచ్ నాగరాజు, ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించిన సందర్భంగా శుక్రవారం డాక్టర్ కవిత రెడ్డి ఫుట్బాల్ అకాడమీ ఫౌండర్ (డి కే ఆర్ ఎఫ్ ఏ) డాక్టర్ కవితా రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నాగరాజు అవార్డు పై డాక్టర్ కవితా రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు. ఫుట్‌బాల్ అభివృద్ధి, గ్రామీణ ప్రతిభను వెలికితీయడం, కోచ్‌ల పాత్ర, యువతను క్రీడల వైపు దారి చూపడం వంటి అంశాలపై ఇద్దరూ చర్చించారు. అవార్డు పొందిన నాగరాజు ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారత ఫుట్‌బాల్ అభివృద్ధి కోసం మరింత సేవ చేయాలనే సంకల్పాన్ని తెలియజేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -