ప్రభాస్, డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘రాజా సాబ్’. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ పాటను ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఫస్ట్ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ప్రభాస్ స్టైలిష్‌గా, వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు. తమన్ ఈ సినిమా కోసం క్రేజీ సాంగ్స్ కంపోజ్ చేశారు.సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. హర్రర్ కామెడీ జోనర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది. ‘ప్రభాస్ ఇప్పటివరకు చేయని జోనర్ ఇది. అలాగే ఇందులో ఆయన కనిపించే తీరు అటు ఆయన అభిమానులను, ఇటు ప్రేక్షకుల్ని సైతం మెస్మరైజ్ చేస్తుంది. ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా మా దర్శకుడు మారుతి అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి బరిలో మా సినిమా మంచి ఫలితాన్ని రాబడుతుందనే నమ్మకం ఉంది’ అని మేకర్స్ తెలిపారు. ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని, మ్యూజిక్ – తమన్, ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్, ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కేఎన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – టీజీ కృతి ప్రసాద్, ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్, రచన, దర్శకత్వం – మారుతి.
సంక్రాంతి బరికి సై..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



