Saturday, November 22, 2025
E-PAPER
Homeసినిమా'ప్రేమంటే'కి సూపర్‌ రెస్పాన్స్‌

‘ప్రేమంటే’కి సూపర్‌ రెస్పాన్స్‌

- Advertisement -

ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన చిత్రం ‘ప్రేమంటే’. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేశారు. నవనీత్‌ శ్రీరామ్‌ డైరెక్టర్‌. పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు, జాన్వీ నరంగ్‌ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మించిన చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా ప్రజెంట్‌ చేసింది. దివంగత నారాయణ్‌ దాస్‌ నారంగ్‌కి ట్రిబ్యుట్‌గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. ఈనెల 21న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకొని, సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ,’ ఇంత మంచి సూపర్‌ హిట్‌ సినిమా ఇచ్చినందుకు ప్రేక్షకులకు, మా నిర్మాతలకు, డైరెక్టర్‌ టీం అందరికి థ్యాంక్యూ. సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆడియన్స్‌ సినిమా చూసి హ్యాపీగా నవ్వుకుంటూ బయటికి వస్తున్నారు. ఈ క్లీన్‌ ఎంటర్టైన్మెంట్‌ని మీరందరూ తప్పకుండా థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘సినిమాకి ఆడియన్స్‌ ఇచ్చిన రెస్పాన్స్‌ అదిరిపోయింది. ప్రతి చోట ఎంజారు చేస్తున్నారు. డైరెక్టర్‌ కావాలనేది నా డ్రీమ్‌. అది ఈరోజు తీరినందుకు చాలా ఆనందంగా ఉంది.

ఆడియన్స్‌ చాలా క్లీన్‌ సినిమా అనే ఫీడ్‌బ్యాక్‌ ఇస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఫ్యామిలీ, యూత్‌ నుంచి వస్తున్న రెస్పాన్స్‌ చాలా బాగుంది. ప్రియదర్శి, ఆనంది పర్ఫామెన్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుంది’ అని డైరెక్టర్‌ నవనీత్‌ శ్రీరామ్‌ చెప్పారు. ఆనంది మాట్లాడుతూ,’సినిమా ధియేటర్లో అద్భుతమైన పాజిటివ్‌ వైబ్‌ ఉంది. సినిమా అయిన తర్వాత అందరూ క్లాప్స్‌ కొట్టారు. అందరూ కూడా చిరునవ్వుతో బయటకు వస్తున్నారు. మా పర్ఫార్మెన్స్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇలాంటి క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ వచ్చి చాలా రోజులైంది. అందరు కూడా అన్ని టెన్షన్స్‌ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని తీసిన సినిమా ఇది. ఫ్యామిలీ అందరూ ఈ వీకెండ్‌ సినిమా థియేటర్స్‌లో చూడండి’ అని తెలిపారు. ‘ప్రేక్షకులందరూ కూడా సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ, నవ్వుకుంటూ వెళ్లారు. సూపర్‌ మూవీ.. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ అని కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు. ఒక నిర్మాతగా చాలా ఆనందంగా ఉన్నాను. సినిమా కలెక్షన్స్‌ రేపట్నుంచి ఇంకా అద్భుతంగా ఉండబోతున్నాయి’ అని ప్రొడ్యూసర్‌ జాన్వి నారంగ్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -