Saturday, November 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశ్రీనివాస కళ్యాణానికి రండి

శ్రీనివాస కళ్యాణానికి రండి

- Advertisement -

సీఎంను ఆహ్వానించిన మహా గ్రూప్‌ చైర్మన్‌ వంశీకష్ణ
నవతెలంగాణ – హైదరాబాద్‌

మహా గ్రూప్‌, మహా భక్తి ఛానల్‌ సారథ్యంలో ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ వారు నిర్వహిస్తున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఈ నెల 26న సాయంత్రం 5.00 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయవలసిందిగా మహా గ్రూప్‌ చైర్మన్‌ మారెళ్ళ వంశీకష్ణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నేరుగా కలిసి ఆహ్వానించారు.
ప్రతి ఏడాది నిర్వహించే ఈ మహోత్సవం ఈసారి హైదరాబాదులో విశేషమైన ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొననున్నట్టు సమాచారం. ఈ వేడుకలో ప్రత్యేక పూజలు, శ్రీవారి సేవలు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వారు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -