– హైదరాబాద్‌లో నిర్వహణ
– బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. రాష్ట్రంలో తొలిసారిగా జాతీయస్థాయిలో చారిత్రక నాణేల సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వారసత్వశాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 11, 12 తేదీల్లో 107వ వార్షిక జాతీయ నాణేల సదస్సు, సెమినార్‌ను నిర్వహించనున్నారు. ఈ సదస్సు బ్రోచర్‌ను శుక్రవారం డా.బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు లాంఛనంగా ఆవిష్కరించారు. న్యూమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఐ) సహకారంతో తెలంగాణ వారసత్వ శాఖ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత నాణేల అధ్యయనంపై జాతీయ స్థాయి కార్యక్రమం హైదరాబాద్‌లో జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కష్ణారావు మాట్లాడుతూ నాణేల చరిత్ర ద్వారా తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని దేశానికి చాటి చెప్పేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
రెండు రోజుల సదస్సు
జూబ్లీహిల్స్‌లోని డా. ఎంసీహెచ్‌ఆర్టీ సంస్థలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు భారతదేశ నలుమూలల నుంచి విద్యార్థులు, స్కాలర్లు, పరిశోధకులు, న్యూమిస్‌మటిక్స్ నిపుణులు పాల్గొనే ఈ సదస్సు, నాణేల చారిత్రక, సాంస్కృతిక, కళాత్మక ప్రాముఖ్యతపై చర్చించేందుకు ఒక వేదికగా ఇది ఉపయోగపడనుందని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక పురావస్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్‌రావు కుతాడి, డిప్యూటీ డైరెక్టర్లు డా. డి.రాములు, డా. పీ నాగరాజు పాల్గొన్నారు.
డిసెంబర్ 11, 12 తేదీల్లో చారిత్రక నాణేల జాతీయ సదస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



