నవతెలంగాణ – హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న హైఓల్టేజ్ చిత్రం ‘అఖండ 2: తాండవం’ నుంచి ట్రైలర్ విడుదలైంది. ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న నాలుగో చిత్రం కావడంతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో బాలకృష్ణ మరోసారి తన పవర్‌ఫుల్ లుక్‌తో, డైలాగ్స్‌తో ఆకట్టుకున్నారు. “His RAGE is DIVINE His POWER is DESTRUCTIVE” అంటూ విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట, బాలకృష్ణ చిన్నకుమార్తె ఎం. తేజస్విని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అఖండ 2 సర్జికల్ స్ట్రైక్’, ‘అఖండ 2 తాండవం’ అనే ట్యాగ్‌లైన్స్‌తో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘అఖండ’కు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



