Saturday, November 22, 2025
E-PAPER
Homeఆదిలాబాద్విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

- Advertisement -

జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న..
నవతెలంగాణ – కుభీర్
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యతతో కూడిన భోజన్ని అందించేలని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న అన్నారు. శనివారం మండల కేంద్రమైన కుభీర్ లోని కస్తూరిబా గాంధీ, ప్రాథమిక పాఠశాలతో పాటు ఉన్నాత పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాలలో ఉన్న పలు రికార్డులను పరిశీలించి పలు సూచనలు సలహాలు అందించారు. అదే విదంగా విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన శాలను పరిశీలించి ఎప్పటికప్పుడు వంట శాలను శుభ్రంగా ఉంచుకునేలా చూడలని అన్నారు.

అనంతరం పదో తరగతి విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలిపారు. ముఖ్యంగా పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తీసుకువచ్చి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు పేరు తీసుకురవాలని సూచించారు. అక్కడి నుంచి ఉన్నాత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కంప్లెక్స్ సమావేశంలో హాజరై పలు సూచనలు అందించారు.ఈ కార్యక్రమం లో మండల విద్యాధికారి విజయ్ కుమార్ సెక్టోరియల్ అధికారి ప్రవీణ్ కుమార్ కంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సురేష్, గంగాధర్, కస్తూరిబా గాంధీ ఎస్ ఓ వాణి శ్రీ ఏ ఈ మహేష్, దత్తాత్రి ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు సి ఆర్ పి లు గంగాధర్ ఆనంద్, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -