- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: మొబైల్ వినియోగదారులకు టెలికం శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. తమ పేరుతో ఉన్న సిమ్ కార్డుల దుర్వినియోగం జరిగితే.. అందుకు వినియోగదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
సైబర్ మోసాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సిమ్ కార్డులను వాడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. తమ గుర్తింపుతో అనుసంధానమైన సిమ్ కార్డులు, పరికరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. IMEI నంబర్లను మార్ఫింగ్ చేసిన ఫోన్లను వాడొద్దని కోరింది.
- Advertisement -



