నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ సింగిల్ విండో చైర్మన్ గా బడాల రమేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని నెలల క్రితం జిల్లా డిసిసిబి అధికారులు చైర్మన్ రమేష్ తో పాటు పాలకవర్గాన్ని తొలగించారు.ఈ తొలగింపుపై చైర్మన్, డైరెక్టర్లు కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు వారికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా సహకార అధికారి ఉత్తర్వుల మేరకు బడాల రమేష్ తో పాటు పదవి కోల్పోయిన 12 మంది డైరెక్టర్లు తమ పదవి బాధ్యతలను మళ్లీ స్వీకరించారు. కోర్టు ఆదేశాలతో విండో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బడాల రమేష్ ను స్థానిక తాజా మాజీ సర్పంచ్ దయ్య దేవయ్య, బఆర్ఎస్ నాయకులు యం.పురుషోత్తం, జె.అశోక్, ఎ. నర్సారెడ్డి, చిలువేరి లక్ష్మీనారాయణ, చెప్యాల గంగరాజం, తదితరులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
కోనాపూర్ విండో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బడాల రమేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



