నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం స్థానిక ప్రిన్స్ చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట నరసింహ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అనుసరించి రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో రిజర్వేషన్లు చేర్చి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మాట ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బీసీలను మోసం చేసిందన్నారు. బిసి జాక్ ప్రతినిధులు మాటూరి అశోక్, సుర్వి శ్రీనివాసు, సాయిని యాదగిరి అన్నారు. రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసంతో స్థానిక ఎన్నికలకు సిద్ధమయ్యారన్నారు.
మాట ప్రకారం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తోలుకపోయి రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా సాధించి ఎన్నికలకు పోతే బాగుండేదన్నారు. కేవలం ఓట్ల లబ్ధి పొందాలని ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి మోసపూరిత కుట్ర అని ఇకనైనా బీసీలు మేలుకొని మోసగిచ్చిన పార్టీలకు దూరంగా ఉండి ఓట్లతోటి వారికి సరైన బుద్ధి చెప్పాలన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలను గెలిపించుకునే దిశగా ప్రజలు సన్నద్ధం కావాలని జిల్లాలో రాబోయే రోజుల్లో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొత్త బాలరాజు, పేరపు రాములు, అశోక చారి,సామల శోభన్ బాబు, ఇట్టబోయిన గోపాల్, పవుర్ విక్రమ్, బిజెపి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం, ఉడుత భాస్కర్, ఉదయగిరి విజయ్, పట్నం కపిల్, పులి ప్రదీప్, తుమ్మల నరేష్, వంగరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.



