Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఏఎమ్మార్ 8వ వార్షికోత్సవ వేడుకలు..

ఘనంగా ఏఎమ్మార్ 8వ వార్షికోత్సవ వేడుకలు..

- Advertisement -

క్రీడల్లో గెలుపొందిన కార్మికులకు బహుమతులు ప్రధానం..
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచర్లలోని కాపురం బ్లాక్-1 ఓసీపీలో బొగ్గునిక్షేపాలు వెలికితీస్తున్న ఏఎ మ్మార్ కంపెనీ 8వ వార్షికోత్సవ వేడుకలను ఏఎమ్మార్ సిఎండి మహేశ్వర్ రెడ్డి  ఆదేశాల మేరకు మంగళవారం ఓసీపీ క్యాంపు ఆవరణలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్మికుల రక్షణ తమ ధ్యేయమని,కార్మికుల అంకిత భావమే సంస్థ పురోగతికి పునాదని,ప్రతి కార్మికుడు సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఓసీపీలో పని చేసే కార్మికులు, ఉద్యోగులు, అధికారులు అందరూ సుభిక్షంగా ఉండాలని తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా 15 రోజులపాటు కంపెనీ కార్మికులకు,ఉద్యోగులకు క్రీడలు నిర్వహించారు.ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, ప్రసంశ పత్రాలు, మేమేంటో లు అందజేశారు. ఉత్తమ ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మైన్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తి,సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు, పిట్ ఇంజనీర్ కిషన్, వెల్పేర్ ఆపిసర్ రమేష్ బాబు, విశ్వప్రసాద్, సర్వోత్తమ్, హెన్ఆర్ డీజీఎం రమేష్ బాబు, సూపర్ వైజర్ బొబ్బిలి నరేశ్,ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -