Wednesday, November 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీసీ రిజర్వేషన్ల.. రాహుల్‌ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్‌

బీసీ రిజర్వేషన్ల.. రాహుల్‌ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా చూపించడంపై ఆయన మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణన పేరుతో రూ.160 కోట్లను ఖర్చు చేసిందని కేటీఆర్‌ తెలిపారు. చివరకు పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి బీసీలకు కేవలం 17 శాతం రిజర్వేషన్లనే కేటాయించిందని పేర్కొన్నారు. గతంలో బీసీలకు ఉన్న 24 శాతం కోటాను కూడా ఇవ్వకుండా కోత పెట్టి బడుగులకు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. కులగణన పేరిట ప్రజా ధనాన్ని వృథా చేసి, చివరకు బీసీ రిజర్వేషన్లను తగ్గించడానికి కాంగ్రెస్‌ నాయకత్వం ఏ జ్ఞానంతో పనిచేసిందని ఆయన ప్రశ్నించారు. ఈ మోసంపై స్పందిస్తారా అని రాహుల్‌గాంధీని నిలదీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -