జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న నగర శివారు ప్రాంత మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయడం పేద, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారుతుందని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో జిహెచ్ఎంసిలో శివారు ప్రాంతాల విలీనంపై జరిగిన నిర్ణయంపై ఆయన మాట్లాడుతూ.. ప్రజల స్థితిగతులపై ఏమాత్రం అవగాహన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. శివారు ప్రాంతాల విలీనంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గ్రేటర్ లో మున్సిపాలిటీల విలీనం పేదలకు పెనుభారం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



