Wednesday, November 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశబరిమల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం..ఇద్దరు మృతి

శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం..ఇద్దరు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : శబరిమల యాత్రలో విషాదం చోటుచేసుకుంది. అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భక్తులు మరణించారు. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలానికి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, వీరరామచంద్రాపురం, పెదంచలకు చెందిన ఆరుగురు వ్యక్తులు అయ్యప్ప మాల ధరించారు. ఇందులో భాగంగా అయ్యప్పను దర్శించుకుని మాల విరమణ చేయడానికి ఓ కారులో శబరిమల వెళ్లారు. స్వామిని దర్శించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం కాగా.. రామేశ్వరం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు, ఓ లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నవీన్‌ (24), సాయి (25) అక్కడికక్కడే మృతి చెందారు.

మరో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు వెంటనే రామేశ్వరం బయలుదేరి వెళ్లారు. అయ్యప్ప భక్తుల మృతి పట్ల పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యల కోసం కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు ఆమె విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -