- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తిరుపతి జిల్లా వేలంపాడులోని ఒక టైల్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంకర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను వెంటనే వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



