Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అందిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు..

అందిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు..

- Advertisement -

ఎన్నికల కోడ్ తో పంపిణీకి బ్రేక్.!
నవతెలంగాణ – మల్హర్ రావు

చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ చీరలు రానే వచ్చాయి. దీంతో మండలం లోని 15 గ్రామపంచాయతీల్లో చీరలు పంపిణీ చేశారు. 693 గ్రామైఖ్య సంఘాల్లో 7.060 సభ్యులు ఉండగా 7,011 చీరలు మంజూరయ్యాయి. కాగా చీరల పంపిణీకి ఆధార్, జాబ్ కార్డులు అనుసంధానం చేశారు. ఆధార్ కార్డు చూసి చీరలు పంపిణీ చేశారు. ఈ బాధ్యతలను వీవో సభ్యులకు అప్పగించారు. దాదాపుగా అందరి మహిళల వద్ద ఆధార్ కార్డు ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చీరలు పంపిణీ చేయడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం జాబ్ కార్డు, ఆధార్ కార్డులతో పంపిణీని అనుసంధానం చేసింది. గతంలో ఐకేపీ అధికారులు మహిళలకు చీరలు అందించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమాన్ని వీవో సభ్యులకు అప్పగించింది. మండలంలో 90 శాతం పంపిణీ పూర్తియినట్లుగా తెలుస్తోంది.

ప్రత్యేక యాప్లో…
18 ఏళ్లు నిండి జాబ్బెకార్డు,ఆధార్ కార్డులు ఉన్న మహి ళలకు చీరలు పంపిణీ చేశారు. తొలుత మహిళా సంఘాల యాప్లో గ్రామం, సంఘం పేర్లు, సభ్యుల వివరాలు ఉంటాయి. చీరను పొందే మహిళ పేరుపై క్లిక్ చేసి ఆ మహిళా ఫొటోను తీసి నమోదు చేశారు. అంతేకాకుండా ప్రత్యేక రిజిస్టర్లో ఆధార్ కార్డు వివరాలు సైతం నమోదు చేసుకున్నారు. కాగా మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -