Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా టీఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా టీఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నగరంలోని అంబేద్కర్ కాలనీలో టిఎమ్ఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లాని శివ మాదిగ నేతృత్వంలో ఆవిర్భావ ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నరాల రత్నాకర్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు ఆధారంగా వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి వర్గీకరణ అమలు చేశారని తెలిపారు. అలాగే భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు , టి ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

టీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవం నాడే టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇటుక రాజు మాది టిఎంఆర్పిఎస్ ఏర్పాటు చేశారని వర్గీకరణ కోసం ముఖ్య భూమిక పోషించి గల్లి నుంచి ఢిల్లీ వరకు ఎన్నో పోరాటాలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమలు చేశారని అలాగే ఎస్సీ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు లబ్ధి కొరకే , ఉద్యమంలో పాల్గొన్న కేసులు అయినట్టు వారి పైన కేసులు ఎత్తివేయాలని మాజీ మంత్రివర్యులు మోతుపల్లి నరసింహులు  ఇటుక రాజు మాది ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి సానుకూలంగా చేస్తారని ఆశ భాగం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్యాల గోవర్ధన్, టిఎంఆర్పిఎస్ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి డి. హరీష్ మాదిగ పట్టణ అధ్యక్షులు బండారి పల్లి మల్లేష్ మాదిగ, బోధన్ నియోజకవర్గ ఇన్చార్జ్ మోహన్ మాదిగ మాదిగ మహిళ సమైక్య నాయకులు జ్యోతి మాదిగ , పద్మ మాదిగ, రాధ మాదిగ  మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ అఖిల్ మాదిగ , సాయి , నరేష్, అరవింద్ కాలనీవాసులు గిరి మాదిగ , లక్ష్మణ్ మాదిగ, రాఘవేందర్, దీపు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -