Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం బుధవారం గ్రామంలో ఉన్న ప్రజలు, భక్తుల మధ్య కోలాహలంగా, అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతాన్ని పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా పాడిపంటలతో ఎల్లప్పుడూ సుఖంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, వాసంశెట్టి గోవిందు, శ్రీరామ్, లక్ష్మీనారాయణ, తిరందాసు విష్ణు, షేక్ ఫయాజ్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -