నవతెలంగాణ – హైదరాబాద్: ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నెంబర్ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాడిల్ మిచెల్‌ను అధిగమించి నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గత రెండు మ్యాచుల్లో రేటింగ్ పాయింట్లు తగ్గడంతో రాడిల్ ర్యాంకు దిగజారింది. త్వరలోనే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న క్రమంలోనే రోహిత్ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. రోహిత్ నంబర్ వన్ స్థానాకి చేరుకోవడంతో టీమిండియా అభిమానులు జట్టుకు శుభ సంకేతంగా భావిస్తున్నారు. ఇక ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 4వ స్థానంలో, విరాట్ కోహ్లీ 5వ స్థానంలో, శ్రేయాస్ అయ్యర్ ఒక ర్యాంకు దిగజారి 9వ స్థానానికి చేరుకున్నాడు.
మళ్లీ వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా హిట్ మ్యాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



