జెవివి రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు వెల్లడి
నవతెలంగాణ – కంఠేశ్వర్
మన దేశ ఆత్మ రాజ్యాంగం.. దాని ప్రతిరూపమే పీఠిక అని జెవివి రాష్ట్ర అధ్యక్షులు నర్ర రామారావు తెలిపారు. బుధవారం జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కోయేడి నర్సింహులు అధ్యక్షతన రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ పక్షాన మోపాల్లోని ప్రేసిడెన్స్ హైస్కూల్లో విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కోయాడ నరసింహులు అధ్యక్షత వహించగా, ముఖ్య వక్త గా విచ్చేసిన జె వి వి రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన చేస్తూ ప్రసంగించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హిందువు లకు భగవత్ గీత, ముస్లిం కు కూరాన్, క్రిస్టయన్ కు బైబుల్ కన్న భారత దేశ ప్రజలమైన మనకు రాజ్యాంగం పవిత్రమైందని మత, కులాలకు అతీతంగా అందరికి సమాన హక్కులు,విధులు, భాద్యతలతో ఈ రోజు రూపు దిందుకున్న రాజంగం పట్ల అవగాహన అవసరమని అన్నారు.రాజ్యాంగ పీఠకలో పొందుపర్చిన సార్వబహు మ, ప్రజాస్వామ్య సామ్యవాద, లౌకిక,ఘన తంత్ర అంశాల గురించి విద్యార్థులకు వివరించి చెప్పారు. దీనిలో జె వి వి జిల్లా అధ్యక్షులు కోయేడి నర్సింహులు, స్కూల్ ప్రిన్సిపాల్ పవన్,వైస్ ప్రిన్సిపాల్ సురేష్ లు మాట్లాడారు.దీనిలో జెెవివి జిల్లా కోశాధికారి గుర్రం వెంకట మల్లయ్య, స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ సురేష్, విట్టల్ రెడ్డి తో పాటు స్థాఫ్ పాల్గొన్నారు.



